కరీంనగర్ కమిషనరేట్ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి.

 

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 18

శనివారం నుండి అధికారికంగా లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన విషయం విదితమే. కావున ఎన్నికల విధుల్లో పోలీసులు నిమగ్నమై ఉంటారని,కావున బాధితుల నుండి ఫిర్యాదుల స్వీకరణ కరీంనగర్ కమిషనరేట్ కంప్లైంట్ సెల్ నందు ప్రతి సోమవారంనాడు మాత్రమే స్వీకరించబడును.ఇట్టి విషయాన్నీ ప్రజలు గమనించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుండి ఈ నియమం అమలవుతుంది. ఇకముందు కమీషనరేట్ కంప్లైంట్స్ సెల్ నందు ఫిర్యాదు చేయదలచిన బాధితులు నుండి ప్రతి సోమవారం నాడు మాత్రమే వారి ఫిర్యాదులు స్వీకరించబడునని,కావున ప్రజలు సహకరించాలని పోలీస్ కమీషనర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking