సమాజ సేవ కోసం చిల్డ్రన్స్ చారిటేబుల్ ట్రస్ట్ ఏర్పాటు.
రాష్ట్ర నాయకులు రాజకీయ విశ్లేషకులు
కల్లూరి హనుమంతరావు పటేల్.
తూప్రాన్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఆనందంగా ఉంది.
మెదక్ జిల్లా ఎంపీపీలపోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ.
మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
ఎక్కడికి ఎగిన ఎంత ఉన్నత శిఖరాలకు అధిరోహించిన పోగడరా నీ చధువులమ్మ ఓడి అయిన తూప్రాన్ చిల్డ్రన్స్ హైస్కూల్ ఉన్నతిని యావత్ ప్రపంచ నలుమూలలా వెళ్లి విరిసిన ఖ్యాతిని అంటూ ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి 40 ఏళ్ల తర్వాత ఒక్కటైన శుభ తరుణం లో 3 వేల మంది పూర్వ విద్యార్థుల మధురానుభూతులు వర్ణనాతీతం. ఒక్కరా ఇద్దరా ఏకంగా దాదాపు మూడు వేల మంది నలుభై ఏళ్ల తర్వాత ఒక్కటై చూడ ముచ్చటగా ఒకే వేదిక పై కలిసి విన్నుతనంగా ఏకంగా సమాజ సేవ లో మేము సైతం అంటూ చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలందించాలనే దృడ సంకల్పంతో కొత్త పుంత తొక్కి నూతన అంకాన్ని అద్భుతంగా అహుతుల కర తాల ధ్వనుల మధ్య చారిటబుల్ ట్రస్ట్ ను ఆవిష్కరించారు. ఇందుకు మొదటగా సామాజిక విశ్లేషకులు, సీనియర్ పొలిటిషియన్ రాష్ట్ర నాయకులు కల్లూరి హనుమంతరావు.
మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ లు లక్ష రూపాయల విరాళం ఇచ్చి శ్రీకారం చుట్టారు. తూప్రాన్ పట్టణం లోని చిల్డ్రన్స్ హై స్కూల్లో 40 వ సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ హై స్కూల్లో చదువుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర నాయకులు కల్లూరి హనుమంతరావు, హైదరాబాద్ సిఐ రవికుమార్, మెదక్ జిల్లా ఎంపీపీలపోరం అధ్యక్షులు, శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ , పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, బాదే విజయ్ లు మాట్లాడుతూ చిల్డ్రన్స్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ కోసం తనవంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందిస్తున్నామని హనుమంతరావు ప్రకటించారు. దీనితో స్పందించిన స్కూల్ కరస్పాండెంట్ వరప్రసాదం చారిటబుల్ ట్రస్ట్ కు లక్ష రూపాయల విరాళాలు తన వంతు అందిస్తున్నట్టు ప్రకటించారు. సుమారు 3000 మంది విద్యార్థులు 40 సంవత్సరాలు గా తూప్రాన్ లో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఎదుగుతున్న వైద్యులు ఉపాధ్యాయులు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉన్నత అధికారులు, సైనికులు, పోలీసులు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన చిల్డ్రన్స్ స్కూల్ శిష్య బృందం ఒక దగ్గర చేరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో పాల్గొని తమ తీపి అనుభవాలను పంచుకున్నారు. సామాజిక విశ్లేషకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత కల్లూరి హనుమంతరావు మాట్లాడుతూ అ’పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలుసుకున్నాములే చదువులమ్మ చెట్టు నీడలో అంటూ గత 40 ఏళ్ళుగా వివిధ విద్యా సంవత్సరాల్లో ఒకే స్కూల్లో చదివిన విద్యార్థులంతా ఒకే చోట చేరి సందడి చేశారు. ఈ అపూర్వ ఘటనకు తూప్రాన్ పట్టణంలోని చిల్డ్రన్ స్కూల్ వేదికైంది, అపూర్వ విద్యార్థి సమ్మేళనం, ఒకే చోటగా వేదికగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందించాలని నిర్ణయించామని నిరుపేదలకు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నలంద కళాశాల ఇంచార్జ్ రవికుమార్, శివంపేట పిఎసిఎస్ వైస్ చైర్మన్ , వేణుగోపాల్ రెడ్డి, ఇస్లాంపూర్ సంతోష్ రెడ్డి, నాచారం బాదే జయకుమార్, వెంకటేష్, నర్మద సీడ్స్ సందీప్ రావు, సురేష్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి , సంజీవ్ పటేల్, బాలేష్, నేతి నాగేష్ గుప్తా, తాటి విశ్వం, వార్త కుమార్, కొట్టంల ఉపేందర్, మాలే నగేష్ గుప్త, చేపురి వీరేశం గుప్త, దేవత గురు ప్రసాద్ గుప్త, ఎం.డి.ఫిరోజ్, అశ్రఫ్, నేతి శ్రీనివాస్ గుప్త, కౌన్సిలర్ పల్లెర్ల జ్యోతీ రవీందర్ గుప్త, తోపాటు సుమారు మూడు వేల మంది చిల్డ్రన్స్ స్కూల్ విద్యార్థులు, చిల్డ్రన్స్ హై స్కూల్ ప్రిన్స్ పాల్ శ్రీమతి విజయ వరప్రసాద్, కడిమే మోజెస్, సుజాత మోజెస్ ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.