భగత్ సింగ్ స్పూర్తితో యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలి

ఆర్. తిరుమలై రామన్,ఏ ఐ వై ఎఫ్
జాతీయ ప్రధాన కార్యదర్శి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 18:
మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని, భగత్ సింగ్ స్పూర్తితో యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. ఏ ఐ వై ఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి ని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ మెమోరియల్ టోర్నమెంట్ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదటి రోజు పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కరచాలనం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆర్. తిరుమలై రామన్ మాట్లాడుతూ క్రీడలు శరీర ఎదుగుదలకు,మానసిక స్థైర్య పెంపుదలకు ఉపయోగపడుతుందన్నారు. భగత్ సింగ్ కు మన దేశం ఏమి చేసిందని ఆలోచించకుండా దేశానికి భగత్ సింగ్ చేసిన నిస్వార్ధం సేవలను గుర్తించాలని, తద్వారా భగత్ సింగ్ అడుగుజాడల్లో నేటి యువత నడిస్తే సామాజిక స్పృహ అలవర్చుకోవచ్చని వారు ఉద్ఘాటించారు. కానీ నేటి పాలకులు భగత్ సింగ్ చరిత్రను వక్రీకరించి గోబెల్స్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారని, ఈ గోబెల్స్ ప్రచారాన్ని సైద్ధాంతిక అవగాహన కల్గిన నేటి యువత తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా పాలకులు క్రీడారంగాన్ని విస్మరిస్తున్నారని, క్రీడలకు సరైన నిధులను బడ్జెట్ లలో మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారులను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం, గుర్తింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏ ఐ ఎస్ ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గ్యారా నరేష్, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్, ఏ ఐ వై ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఆర్. బాలకృష్ణ, నెర్లకంటి శ్రీకాంత్,సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు చెట్టుకింద శ్రీనివాస్, ఏ ఐ వై ఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, నేతలు మాజీద్, కళ్యాణ్, అనిల్, మహేష్, లతో పాటు 10జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking