పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పగడ్బందీగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

సోమవారం పట్టణంలోని రాంనగర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్ష కేంద్రం లోని సిసి కెమెరాల పనితీరును పరిశీలించిన అనంతరం కలెక్టర్ పరీక్షా కేంద్రంలోనికి వెళ్లి పరీక్షల నిర్వహణ సరళని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.పరీక్ష కేంద్రం ముందు భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపాలని, సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా,సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking