ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు పాటించాలి.

ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ మార్చి 18 ప్రజా బలం న్యూస్ :-

ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నీ విడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా ఎస్పీ బాలస్వామి ,అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు తో కలసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా, ఎన్నికల నియమావళి పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలోని

సిద్దిపేట, దుబ్బాక గజ్వేల్ సంగారెడ్డి మెదక్,నర్సాపూర్ పటాన్చెరువు మొత్తం
7 అసంబ్లీ సెగ్మెంట్స్ లలో ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం 18 లక్షల 12 వేల 858 మంది ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడరాదని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి లో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రచార వివరాలను తెలియజేయాలని తెలిపారు.
ఎన్నికల నియమావళి ప్రకారం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు, సందేహాలు ఉంటే సంప్రదించాలని అన్నారు. కంట్రోల్ రూమ్ వివరాలను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయడం జరుగుతున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి ప్రచార సంబంధిత అంశాలు ఉండరాదని తెలిపారు. ఓటరు జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించడం జరుగుతుందని, ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే ముందు సంబంధిత ఏ ఆర్ ఓ,/ ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కి 95 లక్షల రూపాయల వరకు ఖర్చు పరిమితి ఉందని, ఖర్చుచేసే ప్రతి పైసా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తీసి అందులోనుండే ఖర్చు చేయాలని అన్నారు. ఎన్నికల ఖర్చుల పుస్తకాన్ని నిర్వహించాలని తెలిపారు. రిజిస్టర్లో బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన జమ, ఉపసంహరణలు, నగదు లావాదేవీలు ఖర్చుల రసీదు ల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని సహాయ ఎన్నికల పరిశీలకులు షాడో రిజిస్టర్లో నమోదు చేస్తున్న లెక్కలతో సరి చూసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచార అనుమతుల కొరకు కలెక్టరేట్లో నెలకొల్పిన సువిధ సెల్ కు లిఖితపూర్వకంగా కనీసం 72 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అన్ని అనుమతులు సువిధ ద్వారానే జరుగుతాయని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించినట్లు సమాచారం ఉంటే ఫోటోలు, వీడియోలను ఈసిఐ కల్పించిన సి విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని అన్నారు.

ఎన్నికల ప్రసార ప్రకటనలను జిల్లాస్థాయిలలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తు ధ్రువీకరణ పొందాలని చెప్పారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ,కాంగ్రెస్ నుంచి ఆంజనేయులు,
బి ఆర్ ఎస్ నుంచి నర్సింహులు,బీజేపీ నుంచి ఎం ఎల్ ఎన్ రెడ్డి,బీఎస్పీ నుంచి సిద్ది రాములు ఎంఐఎం నుంచి సయ్యిద్ సాకేత్ అలీ, సిపిఐ నాయకులు , ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking