నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి జిల్లా పాలనాదికారి వరుణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణకు హరితహారం లో బాగంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో బాగంగా సారంగాపూర్ మండలం గోపాల్ పెట్ గ్రామ పంచాయతీ శివారులోని మహబూబ్ ఘాట్ సమీపం లో డి ఆర్ డి ఓ. ఆధ్వర్యంలో పొనికి వనం ప్రారంభోత్సవం లో. జిల్లా పాలనాధీకారి వరుణ్ రెడ్డి ,ఎస్పీ.ప్రవీణ్ కుమార్,అటవీ శాఖ అధికారి సునీల్
తో కలసి
మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరిత హరం లో బాగంగా జిల్లా టార్గెట్ 4 లక్షల.మొక్కలను జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయితీ,ప్రతి వార్డులో.నాటడం జరుగుతుందని అన్నారు.
ఈ సంధర్భంగా ఇక్కడ 2.200 పొనికి వనం మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. నాటిన మొక్కలలో ఏవైనా మొక్కలు చనిపోయి ఉంటే వాటికి రీప్లేస్ చేసి మొక్కలు నాటాలని అన్నారు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో గుర్తించి మొక్కలను నాటాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కని రక్షించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి సునీల్,డి ఆర్ డి ఓ విజయలక్ష్మి.ప్రజా ప్రతినిధులు మురళి దర్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు,ఎంపిడిఓ సరోజ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking