గుండ్రెడ్డిపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులో ముఖ్యఅతిదులుగా పాల్గొన్న రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ శలకరాజేశ్వర శర్మ‌.‌‍‍. అగ్రికల్చర్ అధికారులు.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి నర్సయ్య , రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ శలకరాజేశ్వర శర్మ మాట్లాడుతూ తూప్రాన్ మండలానికి 500 ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. లివింగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేయడానికి మరియు పంట బై బ్యాక్ కు ఒప్పందం జరిగిందని తెలిపారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమని సూచించారు. ఆయిల్ పామ్ మొక్కలకు మరియు డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఉందని వారు తెలిపారు. ఆయిల్ పామ్ పంటలో మొదటి 4 సంవత్సరాలు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు అని తెలిపారు. కావున రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఏ డి ఏ సంధ్యారాణి ,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు,,రాజిరెడ్డి , గ్రామ రైతుబంధు అధ్యక్షులు మన్నె కృష్ణ ముదిరాజ్, మరియు బొంది సత్తా గౌడ్ ,మండల వ్యవసాయ అధికారి Ao గంగుమల్లు, AEO’s సంతోష్, సిందు,లివింగ్ ఫుడ్ కంపెనీ ప్రతినిధులు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking