మెదక్ మనోహరాబాద్ ప్రజాబలం న్యూస్ :-
మనోహరాబాద్ మండల సమాఖ్య కార్యాలయంలో
మండల కేంద్రంలో మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు మన నిరుపేద కుటుంబాల ద్వారా చదువుతున్నటువంటి పిల్లల స్కూల్ యూనిఫార్మ్స్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది కావున మండల కేంద్రంలో మహిళలు కుట్టుచున్న యూనిఫామ్లను చూడడానికి మన మెదక్ జిల్లా గౌరవనీయులు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ
మన పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పిల్లల యొక్క యూనిఫామ్ లను మన నిరుపేదలు మహిళా సంఘాల
కుట్టడం చాలా మంచి పని అన్నారు.
కుట్టు పని వచ్చిన మహిళల సంఘాల సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.