వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జిల్లా పోలీసులు

స్వయంగా ఎడపాయల వరద ప్రాంతాలను పరిశీలించిన

జిల్లా ఎస్.పి . డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పీ.ఎస్

ప్రజాబలం – మెదక్ జిల్లా నియోజకవర్గo 2 సెప్టెంబర్ 2024 :

మెదక్ జిల్లా అధికార సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలి, సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలి, గ్రామస్తులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉండాలి, వరదలు వస్తున్న ప్రాంతాల్లో, కల్వర్టు ల వద్ద పికెట్స్ ను కొనసాగించాలి అన్నారు. అధికారులు పర్యవేక్షణ చేయాలి, అవసరమైన చోట ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కృషి చేయాలి, అని జిల్లా ఎస్.పి శ్రీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పీ.ఎస్. అధికారులకు ఆదేశాలు చేశారు.
డిస్ట్రిక్ట్ డిసాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏర్పాటు
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి. మాట్లాడుతూ…. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు పట్టణాలు గ్రామాలు జలమయమయ్యాయి, చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కాలనీలు నివాసాలు నీటితో నిండి ఉండగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమై జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలలో వరద ప్రాంతాల్లో పోలీసు సహాయక చర్యలను విస్తృతం చేశామన్నారు. క్లిష్ట పరిస్థితుల దృష్ట ప్రజలు బయటికి రావద్దని, శిథిలవస్థలో ఉన్న నివాసాల్లో ఉండవద్దు, దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. సెల్ఫీ లాంటి దిగడం వరద ప్రాంతాలకు వెళ్లడం చాలా ప్రమాదమని జిల్లా యంత్రాంగం తో కలిసి జిల్లా పోలీస్ శాఖ సహాయక చర్యలు కొనసాగిస్తుంది. అత్యవసర సమయాల్లో డయల్ 100 కు, స్థానిక పోలీసులకు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 87126 57888 ఫోన్ చేసి పోలీసు సాయాన్ని పొందవచ్చు అని అన్నారు.చెరువు కట్టలు తెగిన ప్రాంతాలు, పొంగి పొర్లుతున్న నదుల వద్ద సాహాయక చర్యల్లో భాగంగా నిఘా ఉంచామన్నారు.

       

Leave A Reply

Your email address will not be published.

Breaking