ఉమ్మడి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్

 

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అధిక వర్షాలకు ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు

జిల్లాయంత్రాంగం ఎటువంటి సంఘటన జరిగిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది.

396 చెరువులు వర్షాల కారణంగా పూర్తిగా నిండినవి

విద్యుత్ ప్రమాదాలు సంభవించొద్దు,

ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా పగడ్బందీగా చర్యలు

అన్ని శాఖల అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా
ఆదేశాలు జారీ

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం 2 సెప్టెంబర్ 2024 :

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుందని ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. పొంగే వాగులు, రహదారులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. శిథిలావస్థలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు.
అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
సంఘటనలు జరిగిన తర్వాత మేల్కొనకంటే ముందే ఆ సమస్యను గుర్తించినట్లయితే తద్వారా పరిష్కారం సులభతరం అవుతుందని చెప్పారు
ధూప్ సింగ్ తండా వాగుల మధ్యలో ఉన్నదని అధిక వర్షపాతం నమోదు అయితేతాండామొత్తం అయిపోతుందనిలోతట్టు ప్రాంతాలనుగుర్తించిదానికి అనుగుణంగాచర్యలు తీసుకోవాలన్నారు
జిల్లాలో 396 చెరువులు పూర్తిగా నీటితో నిండిపోయినవని ఏ సమయంలోనైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు జిల్లాలో చెరువులు మండలాల వారీగా లిస్ట్ తయారుచేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం అందజేయాలని అటువంటి లిస్టును మండలాల్లో ఎంపీడీవోఎంఆర్ఓ లకుఅందజేయడం జరుగుతుందని, తద్వారా చర్యలు తీసుకోవచ్చు అన్నారు.
స్ట్రీమ్స్ కెనాల్స్ , కాస్ వే, బ్రిడ్జెస్, రోడ్స్, కల్వర్ట్స్ ఓవర్ ఫ్లో అయితే రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ సమన్వయంగా వ్యవహరించి ప్రజలను ఎవరిని అక్కడికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు
వర్షాలు కారణంగా పురాతన ఇండ్లు కూలిపోయే అవకాశం ఉన్న వాటిని ముందే గుర్తించి అక్కడ నివాసం ఉండే ప్రజలనుఅప్రమత్తం చేస్తూదగ్గరలోఉన్న ప్రభుత్వపాఠశాలలు ప్రభుత్వభవనాలలో పునరావాసంఏర్పాటు చేసి ప్రజలకుసౌకర్యాలు కల్పించాలన్నారు
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ స్తంభాలను ఎవరూ తాగకుండా లూజ్ వైర్స్ ను,ఎలక్ట్రిసిటీఅధికారులు ముందేగుర్తించి
ముందే టాంటాంచేయించి పగడ్బందీగాచర్యలు తీసుకోవాలన్నారు.
మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా విషయంలో కలిసితం కాకుండా చూసుకోవాలని పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు
అధిక వర్షాలపై పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంలో విద్యాశాఖ అధికారి
తో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు.
అత్యవసర సేవలకు ప్రజలకు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేయు విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9391942254 కంట్రోల్ రూము నంబర్లుకు కాల్ చేయాలని తెలిపారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో అన్ని శాఖల జిల్లా అధికారులు మండల తాసిల్దార్లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking