గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి-19 (ప్రజాబలం ప్రతినిధి)

బుధవారం రోజున గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు చట్టాల మీద,డయల్100,షీ టీమ్స్, సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.అసాంఘిక కార్యకలాపాలకు గంజాయి,అక్రమ ఇసుక రవాణా, పిడియాస్ రైస్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని , పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.ఎస్పీ వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking