పత్తి కొనుగోల్లు ప్రారంభించాల్సిందిగా వినతి

 

– కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గిరిరాజ్ సింగ్ లను కోరిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 19 :

పత్తి కొనుగోలు కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ను కలసి సమస్యను గురించి చర్చించారు. ఈ సమావేశం తర్వాత, కిషన్ రెడ్డి వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను సంప్రదించారు, ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించి, పత్తి కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా సూచించారు. ఈ చర్చలో ఎంపీ వంశీ కృష్ణ పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, న్యాయమైన ధరలు, సమయానికి కొనుగోలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా, పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించేందుకు తన వంతు కృషిని కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking