పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
మెదక్ జిల్లా.
పత్రిక ప్రకటన – 12.02.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన నీరుడి పెంటమ్మ తనకు మస్కురి ఉద్యోగం ఉండగా ప్రభుత్వం దానిని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి బదిలి చేయగా ఇంతకు మునుపు నాగ్సాన్పల్లి గ్రామానికి గాను మస్కురితనం లో ఎనిమిది మంది ఉన్నామని ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఈ ఉద్యోగం మన అందరిది కాని నీవు ఒక్కదానివే చేస్తున్నావు కావున వారికి డబ్బులు ఇవ్వవలసిందిగా లేనియడల నా భూమి తీసుకుంటామని, నన్ను నా కొడుకుని కోడలును మరియు వారి పిల్లలని చంపుతామని బెదిరిస్తున్నారని నన్ను గృహ నిర్భందం చేసి భయబ్రాంతులకి గురిచేస్తున్నారని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని కౌడిపల్లి ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే హవేలి ఘనపూర్ గ్రామానికి చెందిన కమ్మరి నిర్మల భర్త రవీందర్, ఆటో డ్రైవర్ అయిన తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించినాడని ఇంకా ఇన్సూరెన్స్ రాలేదని కావున ఇన్సూరెన్స్ వచ్చు విధంగా తనకు న్యాయం చేయాలని కోరగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ సి.ఐ. గారికి తగు సూచనలు చేయటం జరిగింది.