అట్టహాసంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవం

ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభసూచకం.

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు.

జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 12

జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టి డబ్ల్యూ జె ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాబురావు జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి హాజరై జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ జమ్మికుంటలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ కార్యాలయం లేదని గతంలోనే ప్రయత్నాలు జరగా అది మధ్యలోనే ఆగిపోయిందని అయినప్పటికీ స్థానిక జర్నలిస్టు మిత్రులు వారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభసూచికమని ఆయన అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా జర్నలిస్టుల సంక్షేమానికి టిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు.

జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలి.

వైస్ చైర్మన్ స్వప్న కోటి.

అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని అంతే కాకుండా ప్రతినిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న పత్రిక మిత్రులు వారికి సొంత కార్యాలయ భవనం లేకపోవడం బాధాకరమని ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేసినప్పటికీ వారు ఎలాంటి ఎదుగుదలకు నోచుకోకపోవడం కనబడుతుందని వారికి అండగా ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. స్థానికంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని వారి సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ప్రెస్ క్లబ్ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.
జర్నలిస్టులు బాధ్యతతో మెలగాలి.

జమ్మికుంట ఎస్సై రాజేష్.
జర్నలిస్టు వృత్తి కత్తి మీద సాము లాంటిది అని జర్నలిస్టు బాధ్యతతో పనిచేస్తేనే నిజాలు బయటకు వస్తాయని ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా జర్నలిస్టు పనిచేస్తారని ప్రతినిత్యం ప్రజా సమస్యలపై సృజనాత్మక స్టోరీలను అందిస్తూ మరుగున పడ్డ నిజాలను బయటకు తీయడం అది ఒక జర్నలిస్టుకే సాధ్యమని అలాంటి జర్నలిస్టులు తమ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు. ప్రతి జర్నలిస్టు తన ఉద్యోగాన్ని తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
జర్నలిస్టుల సమస్యలపై ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి.

జాతీయ కౌన్సిల్ మెంబర్ కుడుతాడి బాబురావు.

ప్రతినిత్యం కత్తి మీద సామూలాంటి ఉద్యోగంలో ఉంటూ పనిచేసే జర్నలిస్టు తమ సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలని అప్పుడే ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలపై స్పందిస్తారని ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.

అందుబాటులో ప్రెస్ క్లబ్ కార్యాలయం.

ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలు రాసే జర్నలిస్టులు వారికి ఒక కార్యాలయం ఉండడం అవసరమని దాని ద్వారా ప్రజలు కూడా తమ సమస్యలను తెలపడానికి వస్తారని అలాంటి కార్యాలయాన్ని ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిని రవి అన్నారు. అనంతరం వచ్చిన అతిథులు జర్నలిస్టులకు యూనియన్ కార్డులను జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాను అయిత రాధాకృష్ణ చేతుల మీదుగా సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచందర్ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డే రాజేంద్రప్రసాద్, రాష్ట్ర నాయకులు భూపతి సంతోష్ జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు వాసాల రామస్వామి సిపిఎం నాయకులు కొప్పుల శంకర్ యూనియన్ కోశాధికారి దెయ్యాల సుధాకర్ ఉపాధ్యక్షులు ఏబూసి సంపత్ సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్, రచ్చ.రవికృష్ణ,తాళ్లపల్లి రాజు, కందుకూరి రాజు, శ్రీనివాస్, పలువురు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking