ఇంజనీరింగ్ విద్యార్థి నేరెళ్ల సీతారాములు ఆచూకీ లభించకుండా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి కారణమని అతని సోదరుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు.

 

హైదరాబాద్ ప్రజా బలం న్యూస్:-

మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన నేరెళ్ల సీతారాములు ఇంజనీరింగ్ విద్యార్థి ఆచూకీ లభించకుండా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి చేశాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో అతని సోదరుడు నేరెళ్ల శ్రీరాములు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా అతని సోదరుడు మాట్లాడుతూ తీవ్రవాద దేశాలైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో మిస్సయిన వారు కొన్ని గంటల్లోనే ఆచూకీ లభిస్తుంది కానీ మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో 2006సంవత్సరం ఫిబ్రవరి 2వ వారం లో ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నుండి అదృశ్యమైన నా సోదరుని ఆచూకీ నేటికీ లభించలేదని ఆచూకీ తెలపకుండా సాక్షాధారులు లేకుండా తీవ్ర ఇబ్బందులకు పోలీసులు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అదృశ్యమైనప్పుడు తన సోదరిని దగ్గర సెల్ ఫోన్ నెంబర్ 9949178289 ఉండేదని ఆ సెల్ ఫోన్ డాటా ఇవ్వమంటే పోలీసులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేశారని ఆవేదన చెందారు. దీనికి అంతటికి కారణం అప్పుడు కమిషనర్ గా ఉన్న మాజీ డిజిపి మహేందర్ రెడ్డి బాధ్యుడని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking