-సంక్షేమ హాస్టలను అభివృద్ధి చేయాలి
-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 12
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆఫీస్ బెరర్స్ సమావేశం మంకమ్మతోట లోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాంపెళ్ళి అరవింద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శరీర రజనీకాంత్ హాజరైనారు.
ఈ సందర్భంగా శనీగరపు రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. కొఠారి కమిషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన కానీ కనీసం పట్టించుకోకుండా విద్యారంగానికి కేవలం 7.8% మాత్రమే బడ్జెట్ కేటాయించడం చాలా అన్యాయమని తెలిపారు. ఈ బడ్జెట్ కేవలం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల కోసం మాత్రమే సరిపోతాయని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 7200 కోట్లు రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అయినా బడ్జెట్ సమావేశాల్లో వాటిపైన కనీస చర్చించలేదని తెలిపారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు రావాల్సిన 6300 కోట్ల రూపాయలు మెస్ ఛార్జీలు రాక విద్యార్థులు నాసిరకమైన భోజనం తింటూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని వారు తెలిపారు. కావున పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నెలకు 3000 రూపాయలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి.అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి. కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ కనీసం రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు, కనీస బస్సు సౌకర్యం, బ్యాంకు లేదా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఇప్పటికీ అయిన ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి శాతవాహన యూనివర్సిటీ నీఅభివృద్ధి చేయాలని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంపెళ్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అభిలాష్, హరీష్, సహాయ కార్యదర్శి అసంపెళ్ళి వినయ్ సాగర్ పాల్గొన్నారు.