నిర్మాణంలో ఉన్న నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు ఆవరణ లో వన మహోత్సవ లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ. పోలీసు ఉన్నదికారులు.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పి డా.జానకి షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది,పరిశుభ్రత, పచ్చదనము,ఆహ్లాదకరమైన వాతావరణము గురించి మొక్కలు చాలా ముఖ్యం అందులో భాగంగా ఈరోజు నిర్మాణం లో ఉన్న డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు ప్రాంతంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి (200) మొక్కలు నాటడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా పోలిస్ సిబ్బంది చేత 142000 మొక్కలు నటించటం జరిగింది. ఈ వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా మొత్తం 198000 మొక్కలు పోలీసు సిబ్బంది చేత నాటించాలని అన్నారు.
భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్,ఐపిఎస్ గారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సిబ్బందికి సూచించారు.ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలని భావితరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.
నిర్మల్ డిఎస్పి గంగా రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రత పచ్చతనముతో ఆహ్లాదకరంగా ఉంచాలని అన్నారు.
వన మహోత్సవ నోడల్ అధికారి ఆర్ఐ రామ్నిరంజన్ మరియు ఆర్ఎస్ఐ రవి లను ఎస్పి
అభినందించారు.
ఈ కార్యక్రమంలో భైంసా ఏ.ఎస్పీ. అవినాష్ కుమార్ ఐ.పి.ఎస్,నిర్మల్ డి.ఎస్పీ గంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు నైలు, గోపీనాథ్,అశోక్, సురేందర్,ప్రవీణ్ కుమార్,శ్రీనివాస్, మల్లేష్, నవీన్ కుమార్, ఆర్ఐ లు రామ్నీరంజన్, రమేష్ , రామ కృష్ణ,అర్ఎస్ఐ లు,ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking