ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారితాత్మకమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.పేదలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని.ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణకు కాంగ్రస్ పార్టీ మద్దుతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మందకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కొనసాగిన 3 దశాబ్దాల పోరాటాలు ఫలించిందని అన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.