చేపల సొసైటీ నూతన సభ్యులకు మేకల మల్లిబాబు యాదవ్ చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేత

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 (ప్రజాబలం) కామేపల్లి మండలం కొమ్మి నేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొమ్మి నేపల్లి- పండితాపురం గ్రామానికి చెందిన 106మంది గిరిజనులు నూతన సభ్యత్వం స్వీకరించారు. సభ్యత్వ గుర్తింపు కార్డులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మరియు పాలకవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల చట్టం ప్రకారం చేపల సొసైటీలలో కొత్తగా గిరిజనులకు మాత్రమే సభ్యత్వం వచ్చే అవకాశం ఉందని, గత 50 సంవత్సరముల నుండికేవలం చేపల వృత్తిని ఆధారంగా చేసి జీవించుకునే కులాలకు సభ్యత్వ అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. సొసైటీలోని గతంలోని సభ్యులు మరియు నూతన సభ్యులు ఐకమత్యంతో కలిసి పని చేసుకోవాలని, సూచించారు. కామేపల్లి మండలంలో గిరిజనులు, గిరిజనేతరులు అన్యోన్యంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నారని, గిరిజన చట్టం గురించి అవగాహన కల్పించి, సంఘంలో సభ్యత్వం రావటానికి కృషి చేసిన సభ్యులు భూక్యా నాగేంద్రబాబుకు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్ కు మల్లి బాబు యాదవ్ అభినందనలు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంఘం సభ్యునికి 5000 రూపాయలు వితరణగా మల్లి బాబు యాదవ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు బండి నాగేశ్వరరావు మాజీ సర్పంచ్ బానోత్ నరసింహ నాయక్, మాజీ ఉపసర్పంచ్ ధరావతలాలు, శీలం పుల్లయ్య, ధరావత లక్ష్మ, గుగులోతు కిషన్, బండి పాపయ్య, చల్ల నరసింహారావు, మామిళ్ల చిన్న నరసయ్య, అయితనబోయిన వీరభద్రం రాయల నాగ శంకర్ తురక బిక్షం బత్తుల ఉపేందర్ చల్ల మల్లయ్య డేరంగుల తిరపయ్య, మొగిలి శ్రీను, మేకల లక్ష్మీనారాయణ మరియు సంఘం నందు ఉన్న సభ్యులందరూ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking