సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణకు అనుకూల తీర్పు హర్షనీయం

ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు శెనిగారపు లింగన్న

అంబేద్కర్ విగ్రహానికి, మందకృష్ణ ఫొటోకు పాలాభిషేకం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 01: సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షనీయమని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు శెనిగారపు లింగన్న పేర్కొన్నారు. గురువారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మంద కృష్ణ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా సందర్బంగా అయన మాట్లాడుతూ..మాదిగ ఉపకులాలకు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఆర్థిక,సామజిక, రాజకీయ రంగాల్లో సమానత్వం వస్తుందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత 30 సంవత్సరాల నుండి ఏబీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి నారాయణ, లింగంపల్లి వెంకటేష్, మాజీ మండల అధ్యక్షుడు చొప్పదండి రమేష్,రాజన్న, అల్లంపల్లి రమేష్, బిరుదుల ధర్మయ్య, సంజీవ్,వెంకటేష్, సత్తయ్య,చుంచు రమేష్,శ్రీనివాస్, అవునూరి ప్రసాద్, శ్రీనివాస్,సత్తయ్య, నర్సయ్య,దుర్గయ్య, బానేష్,రాజలింగు, శంకరయ్య,బాపు, మహేష్,దర్శనాల నవీన్,రాయమల్లు, శ్రీనివాస్,తిరుపతి, సుగుణాకర్, సత్తయ్య,లచ్చయ్య, తదితరాలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking