– అన్ని వర్గాల వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా
– తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు
మెదక్ ప్రజాబలం ప్రతినిధి:లోకకళ్యాణార్థం కోసం.. వేద పండితులు పూజలు నిర్వహించడం శుభసూచకం అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న బ్రాహ్మణ సంఘ భవన స్థలం వద్ద బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పవిత్ర ఆషాడ మాసాన్ని పురస్కరించుకోని లోక కళ్యాణార్థం అమ్మవారి అనుగ్రహం కోరి మెదక్ పట్టణ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అభిషేచనం మరియు శ్రీసూక్త లలిత సహస్ర నామ పారాయణం పూజా కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు %-% వాణి లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, ఉప్పల రాజేష్, బొజ్జ పవన్, కౌన్సిలర్ నర్మద శ్రీదర్ యాదవ్, చంద్రభవన్ అశోక్, కౌన్సిలర్ శమి, శివదయాల్, మేడి మధుసూదన్, దుర్గ ప్రసాద్, లింగం, లక్కరు శ్రీనివాస్, పద్మారావు, ఆవుల రాజిరెడ్డి, మాయ శ్రీను, శ్రీనివాస్ చౌదరి, మహేశ్ గౌడ్, సంగమేశ్వర్, గూడూరి శంకర్ గౌడ్, మందుగుల గంగాధర్, అశోక్, లక్ష్మణ్, గూడూరి క్రిష్ణ, ముత్యంగౌడ్, బాని, నాగిరెడ్డి లతో పాటు పట్టణ బ్రాహ్మణ సంఘం పెద్దలు, వేద పండితులు భాష్యం మధుసూదన చార్య, వైద్య శ్రీనివాస్, రాజు, పండిత్ రావ్, క్రిష్ణమూర్తి లతో పాటు తదితరులు పాల్గోన్నారు.
సన్మాన కార్యక్రమంలో…
మెదక్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారిగా విధులు నిర్వహించిన ఆర్. నాగరాజు ను స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టిఎన్జిఓ భవనంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మైనంపల్లి హన్మంతరావు పాల్గోని శాలువాతో సత్కరించారు.
ఎగ్జిపిషన్ కమ్ సేల్ ప్రారంభం…
మెదక్ పట్టణంలోని స్థానిక మాయా గార్డెన్స్ లో ది చెన్నై సిల్క్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్ ను గురువారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు.