బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్
గోశామహల్ ప్రజాబలం ప్రతినిధి:గురువారం గోశామహల్ బిఆర్‌ఎస్ కార్యాలయంలో గోశామహల్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. గత 10 నెలలుగా కోఠి కామత్ హోటల్ లైన్ లో 14 జిహెచ్‌ఎంసి షాపులు ఉన్నాయని తెలిపారు. ఆ షాపుల టెండర్ లలో అవకతవకలు జరిగాయని , బిఆర్‌ఎస్ పార్టీ తరుపున పోరాటం చేశామని… మూడు పర్యాయాలు ప్రజా వాణి లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రెండు సార్లు కమిషనర్ గారి పేషీ లో , అడిషనల్ కమిషనర్ ఎస్టేట్ గారికి , ఏస్టేట్ గారికి కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని విమర్శించారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే వారు చర్యలు తీసుకోవడం లేదన్నారు. టెండర్ అనేది ఎలాంటి ప్రకటన లేకుండా , వారికి అనుకూలంగా ఉన్న వారికి ఒకొక్క కుటుంబంలో ముగ్గురుకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ టెండర్లు రద్దు చేసి , రీ టెండర్ లు వేయాలని , ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని పలు మార్లు అధికారులకు విన్నవించినా వారిలో చలనం రావడం లేదన్నారు. ఒకొక్క షాపు 50 నుండి 60 వేలకు రెంట్ ఉన్నప్పటికీ తక్కువ ధరలకు కట్టబెట్టారని మండిపడ్డారు. అలాగే అబిడ్స్ లోని ఓ షాపు టెండర్ కు వెళ్తే , గతంలో 2 వేలు కిరాయి ఉన్న షాపు 21 వేలకు ఓపెన్ టెండర్ లో వచ్చిందన్నారు. కోఠి లోని 14 షాపులకు ఇదే విధంగా ఓపెన్ టెండర్ లు నిర్వహించి , దీని వెనుక ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఆ షాపుల ముందు నిరాహారదీక్ష చేపడతానని హెచ్చరించారు. అవినీతి అధికారుల వల్ల పేద ప్రజలు నస్తపోతున్నారని , ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందన్నారు. వాటికి రీ టెండర్ అయ్యే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాంబగ్ డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్ భాయ్ పాల్గొన్నారు.