చిన్నారులకు తల్లిపాలే శ్రేయస్కరం: అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

 

జయశంకర్‌ భూపాలపల్లి ప్రజాబలం ప్రతినిధి   చిన్నారులకు తల్లిపాలే శ్రేయస్కరమని, అప్పుడే పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు పట్టించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు.

గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ తో కలిసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలింతలు, డాక్టర్లు, స్టాఫ్ నర్స్ లకు తల్లిపాల పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, ప్రతీ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించి బిడ్డలకు ముర్రు పాలు పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలపై బాలింతలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు.
పట్టించడం వల్ల రోగనిరోధక పెరుగుతుందని, చిన్నారులకు కచ్చితంగా ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలని, తర్వాత తల్లి పాలతో పాటు అదనంగా నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని పేర్కొన్నారు.
అంగన్వాడీ, ఆశా కార్యకర్తల ద్వారా గ్రామ స్థాయిలో బాలింతలకు తల్లి పాల వల్ల కలిగే బిడ్డకు కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ నవీన్ , పి.ఓ.ఎం.హెచ్.ఎన్ డాక్టర్ శ్రీదేవి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking