జయశంకర్ భూపాలపల్లి ప్రజాబలం ప్రతినిధి :ఆగస్ట్ 3వ తేదీన రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం గణపురం మండలం, మైలారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు చేయనున్న నేపధ్యంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టేజి ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మైదానాన్ని పరిశుభ్రం చేసి వాటర్ ప్రూఫ్ టెంట్, కుర్చీలు వేయాలని అన్నారు. మంచినీరు ఏర్పాటు చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వాహనాలు పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విధులు కేటాయించిన సిబ్బంది ఎలాంటి అంతరాయం రాకుండా ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఈ నిర్మల, ఆర్డిఓ మంగిలాల్, ఎంపిడిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.