ఒక తల్లి తన బిడ్డకు ఇవ్వగల మొట్టమొదటి కానుక
అడిషనల్ కలెక్టర్ లోకల్ రాధిక గుప్తా
జిల్లా వైద్య అధికారి రఘునాథ స్వామి
అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తేదీ 01-08-2024 రోజున జిల్లాలోని గ్రామస్థాయి వార్డు స్థాయిలలో తల్లిపాల విశిష్టతను విస్తృత స్థాయిలో దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని సంబంధిత అధికారులకు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాధిక గుప్తా ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక తల్లి తన బిడ్డకు ఇవ్వగల మొట్టమొదటి కానుక తల్లిపాలు,
మొదటి ఆరు నెలల వరకు పుట్టిన పిల్లలకు కేవలం తల్లిపాలే సంపూర్ణ ఆహారం మరియు సంపూర్ణ ఆరోగ్యం అందించడానికి తోడ్పడుతుంది అని తెలియజేయాలని.
సి – సెక్షన్ ద్వారా పుట్టిన శిశువు మనుగడకు తల్లిపాలు పట్టించడం తప్పనిసరి అని అడిషనల్ కలెక్టర్ తెలియజేశారు.
2024 ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిచే తల్లిపాల ప్రాముఖ్యతను చాటే పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రఘునాథ స్వామి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి, జిల్లాకు సంబంధించిన సిడిపివోలు తదితరులు పాల్గొన్నారు.