అష్ట దిగ్బంధం చేసిన మణికొండ ప్రజానీకం, బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 01 ఆగస్టు 2024:
సీనియర్ మహిళా శాసన సభ్యురాల్లపై నిండు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వాఖ్యలను మణికొండ ప్రజానీకం, బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తూ, తాను చేసిన వాఖ్యలను ఉప సంహరించుకుని తెలంగాణ ఆడ బిడ్డలకు క్షమాపణ చెప్పడానికి సరియైన సమయం ఇచ్చి తదనంతరం క్షమాపణ చెప్పనందు వలన మణికొండ ప్రజానీకం, భారత రాష్ట్ర సమితి నాయకులు దాదాపు 100 మందికి పైగా మణికొండ మర్రిచెట్టు కూడలిని అష్ట దిగ్బంధం చేసి నిరసన కార్యక్రమం తలపెట్టినారు, తదుపరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం తెలంగాణా ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీ ఆర్ ఎస్ కార్యకర్తలు దహన కార్యక్రమానికి ప్రయత్నం చేయగా రాయదుర్గం పోలీసు సిబ్బంది కల్పించుకోవడంతో దిష్టి బొమ్మ చిందర వందర కావడమే కాకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేయడం జరిగిందని, ఆ క్రమంలో మణికొండ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, కౌన్సిలర్ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, ముత్తంగి లక్ష్మయ్య, డాక్టర్ కీర్తిలతా గౌడ్, సురేఖ, రేఖా, సుమ, ఉపేంద్రనాధ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, భాను, మల్లపురం శ్రీనివాస్, ఉసేన్, శివ ముదిరాజ్, ఆరిఫ్, ఉదయ్, మహేష్, ఏ.రమేష్, గురుకుల నవీన్ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking