శ్రీ చైతన్య పాఠశాలలో బోనాల వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటల మున్సిపాలిటీ లోని శ్రీ చైతన్య టెక్నో ప్రవైట్ పాఠశాలలో ఆషాఢమాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు, విద్యార్థినిలు బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మావారికి బోనాల నైవేద్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు, ఆనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు,పోతారాజుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి,ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అశ్విని మాట్లాడుతూ…తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని,ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు,అదే విదంగా రైతులు వేసిన పంటలకు వర్షాలు బాగా కురిసి వారు వేసిన పంటలు సమృద్ధిగా పండలని,ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి వేడుకున్నారు. మా పాఠశాల పిల్లలు చాలా ఆనందంగా పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో పాఠశాల కో ఆర్డినేటర్ జయ,అకౌంటెంట్ సురేష,పైపటి ఇంచార్జి శిరీష,శ్రీనివాస్,కిషన్, విద్యార్థీని,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking