అనారోగ్య కారణాలతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్మడ్ రిజర్వు విభాగంలో పనిచేస్తూ గత సంవత్సరం అక్టోబర్ నెలలో మరణించిన ఏ ఆర్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కుటుంబానికి ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన చేతుల మీదుగా 8,60,000/-ల రూపాయల నగదును చెక్కు రూపంలో అందజేశారు.ఈ నగదులో భద్రతా ఎక్స్గ్రేషియా రూ.8,00,000/-, కార్పస్ ఫండ్ రూ.50,000/- మరియు విడో ఫండ్ 10,000/-రూపాయలను ఈ రోజు చెక్కు రూపంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలియజేసారు.అనంతరం వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పోలీస్ శాఖ తరపున ఎలాంటి అవసరమున్నా వెంటనే తమని సంప్రదించాలని తెలియజేసారు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ తమ ఆరోగ్యాల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తలు వహించాలని ఈ సందర్బంగా సూచించారు మరణించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మధు మరియు తదితరులు పాల్గొన్నారు