-దోమల బెడద.. చెత్త ఎత్తే నాధుడు ఎక్కడ..
స్పెషలాఫీసర్లు జర దృష్టి సారించండి
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రూరల్ ఏజెన్సీ ప్రాంతంలో పల్లెలు పారిశుద్ధ్యం పడకేసినట్లు కనిపిస్తుంది. చెత్తాచెదారం పేరుకుపోయిన పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక పల్లెలు గబ్బు గబ్బు వాసనతో దర్శనమిస్తున్నాయి. అనేక ప్రాంతంలో కనీసం పట్టించుకునేవారు కరువై జర దృష్టిసారించి పారిశుద్ధ్యం పై చర్యలు చేపట్టండి అంటూ రోదిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి చెత్తకుప్పలు దర్శనమిస్తూ ప్లాస్టిక్ సీసాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎక్కడ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. గిరిజన పల్లెలు విపరీతంగా దోమలు పెరిగి ప్రజలు భయపడే పరిస్థితులు దాపరించాయి ఎక్కడ చూసినా రోడ్డుపై చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పట్టించుకునేవారు పట్టించుకోకపోవడం, స్పెషల్ ఆఫీసర్లు సైతం దృష్టి సారించకపోవడం పరిపాటిగా మారిపోయింది.

గ్రామపంచాయతీల పాలన అంతంత మాత్రంగానే ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అనేకచోట్ల హ్యాండ్ పంపులు సైతం రిపేర్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే అశ్వరావుపేట మండలంలోని అనేక గ్రామపంచాయతీలో ఇదే పరిస్థితులు దాపరించాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది సైతం దృష్టిసాదించట్లేదని విమర్శలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు సైతం జాడ కనిపించట్లేదని పరిస్థితులు గ్రామాలలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది.ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించి గబ్బు గబ్బు దర్శనమిస్తూ కనీసం చెత్త ఎత్తే నాధుడు లేక, అనేక పల్లెలు గబ్బుతో దర్శనమిస్తూ చర్యలు చేపట్టండి సారు అంటూ.. ప్రభుత్వం వైపు దీనంగా ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా మండలంలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ, అలాగే కావడి గుండ్ల గ్రామపంచాయతీ .. తోపాటు అనేక గ్రామపంచాయతీలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.

పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు ట్యాంకర్లు ఎండల్లోనే దర్శనమిస్తున్నాయి. కనీసం పంచాయతీ సిబ్బంది సైతం పంచాయతీ కార్యక్రమాలపై దృష్టి సారించలేదని చర్చ జోరుగా సాగుతుంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టి గ్రామపంచాయతీ పాలనపై జర కన్నేసి పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి నిలిపి గ్రామాలలో చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.