అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 13, ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన, అనంతరం నిన్న సాయంత్రం పారితోష్ పంకజ్, ఐపీఎస్, అందోల్ జోగిపేట, పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు, ఆవరణ సిబ్బంది, బ్యారెక్ పరిశుభ్రతను పరిశీలిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించగలం అని అందుకే ప్రతి ఒక్కరు పారిశుభ్రతను పాటించాలని అన్నారు, స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించారు,( యు,ఐ) కేసులు పరిమిత లిమిట్ లో ఉండేలా చూడాలని అన్నారు , తరచూ వాహనాల తనిఖీ( నాకబంది) వంటి స్పెషల్ డ్రైవ్ చేపట్టి అనుమానితా వ్యక్తుల వాహనాలను,అదుపులోనికి తీసుకోవాలని సూచించారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ,కేడి, సస్పెక్ట్ లను తరచూ చెక్ చేస్తూ ఆన్లైన్ రికార్డులో ఉన్న వాటిని అప్డేట్ చేయాలని అన్నారు,సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల గురించి, జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు, నిర్వహించాలని, (ఎస్ హెచ్ ఓ కు ) పలు సూచనలు చేశారు, అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలని కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలని అన్నారు, స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారి సమస్యను ఓపిగ విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని, అలాగే పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకమని రోజు వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ కాపాడుకోవాలని అన్నారు, డ్యూటీ పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల ద్వారా నా దృష్టికి తీసుకురావాలని సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు