అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 13,( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా:అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం లోని,సీతానగర్ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆదేశానుసారం ( ఎన్ఆర్ఈజీఎస్ )కింద, సిసి రోడ్ల నిమిత్తం మంజూరైన, నిధులతో గురువారం నాడు పనులు ప్రారంభించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీతానగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగయ్య, అల్లాదుర్గ్ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్, మండల ఉపాధ్యక్షుడు బేతాయ, నాయకులు సాయిలు,కిష్టయ్య,నర్సింలు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.