రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 13 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ ఆద్వర్యంలో ట్రాఫిక్ డి.సీ.పి – టీ.సాయి మనోహర్ ని కలిసి మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్షలు జరుగు సందర్భముగా వాహనాల రాక పోకలతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని కావున మణికొండ మఱ్ఱిచెట్టు, చింతచెట్టు, పాత ఆంధ్రా బ్యాంకు, లాలమ్మ గార్డెన్, పంచవటి కాలనీ కుడల్లలో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది కావున అట్టి రద్దీని నియంత్రించడానికి వ్యవస్థ సమకూర్చి విద్యార్థులకు, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగినది అందుకు సదరు డి.సి.పి సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత సహకారాన్ని అందింస్తానని తెలియ పరచినారని అతన్ని కలసిన కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేంద్ర, ముత్తంగి లక్ష్మయ్య, యాలాల కిరణ్, భాను చందర్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, యాలాల బెన్నీ, సయ్యద్ రఫీక్ లు తెలియ చేసారు.
Prev Post