మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 3:
జిల్లా గణాంక దర్శిని 2021-2022 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సోమవారం సమావేశ మందిర లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక ,ఆర్థిక ప్రణాళిక విధాన,రూపకల్పనలో గణాంకాలు చాల ముఖ్యమైనదన్నారు.రోజువారి జీవితంలో గణాంకాల వాడకం విధానాలను రూపొందించుటలో గణాంకాలు దోహదపడతాయని తెలిపారు.
జిల్లా గణాంక దర్శిని లో జనాభా, వాతావరణం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, రవాణా, నీటి వనరులు, పంటలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, లోకల్ బాడీ, ఇండస్ట్రీస్ సోషల్ సెక్యూరిటీ కి సంబంధించిన అంశాలు వివరంగా ఉంటాయని తెలిపారు.గణాంక దర్శినిలో అన్ని శాఖల జిల్లా గణాంక వివరాలు పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య,ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్ రావు ,ముఖ్య ప్రణాళిక అధికారి సిబ్బంది జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.