జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాలు విజయవంతంగా చేపడుతున్నాం

 

వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 3:
సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి పోడు భూములు పంపిణి , హరిత హరమ్ , రెండవ విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి కార్యక్రమం, ఇంటి స్థలాల పంపిణీ, GP భవనాల నిర్మాణం, బిసి కుల వృత్తులకు ఆర్థిక సహాయం, వైకుంఠధామాలకు విద్యుత్ సదుపాయం.పలు అంశాలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాస్థాయి అధికారుల సూచనల మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు, పథకాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. రాష్ట్రంలోనే అన్ని అభివృద్ధి రంగాల్లో తమ జిల్లా ముందుస్థానంలో ఉందని అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో తమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం, ముఖ్యమంత్రి సహాయనిధి, ఇళ్ళ స్థలాల పంపిణీ, బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం, గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, గృహలక్ష్మీ పథకం, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలు, వైకుంఠదామాలకు విద్యుత్తు, తాగునీటి సదుపాయాలు కల్పించడం జరుగుతోందని ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారికి తెలిపారు. అలాగే తమ సూచనలు, సలహాలతో జిల్లాను మరింత అగ్రగామిగా నిలిపి ఆదర్శంతంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking