నిర్మల్ జిల్లా సొన్ మండలం పాక్ పట్ల లో 50 రెండుపడకల గదుల ఇళ్ల ను ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి.
సొన్ మండలం లోని పాక్పట్ల గ్రామం లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను సోమవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి తో కలసి లబ్ధి దారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాక్ పట్ల గ్రామం లో మొత్తం 50 డబుల్ బెడ్రూం ఇళ్లను ఒక్కొక్క ఇంటికి 5 లక్షల 4 వేల రూపాయల ఖర్చు తో నిర్మించి, ఇల్లు లేని నిరుపేదలకు అందించామని, రానున్నది వర్షాకాలం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. సీసీ రోడ్లు, త్రాగు నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామ పంచాయితీ తరఫున 3 లక్షలకు పైగా వెచ్చించి సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. గ్రామం లో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వ స్థలం లేకపోతే దాతలు ముందుకొచ్చి వారి సొంత భూములను దానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టా పత్రము మహిళల పేరుమీదే ఉంటుందని, ఈ ఇళ్లను అమ్మడానికి, కొనడానికి ఎవరికీ ఏ విధమైన అధికారాలు లేవని, లోన్ల కోసం ,అప్పుల కోసం వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని, సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి వేగం గా జరుగుతుందని, అందులో భాగం గానే పాకపట్ల గ్రామం లో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామని, రెండేళ్లలో కోటిన్నర నిధులతో సీసీ రోడ్లు వేయించామని అన్నారు. తొందర లోనే పాక్ పట్ల గ్రామం లో ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం కాబోతుందని, దానికి సంభందించిన భూమి పూజ కూడా పూర్తయిందని, ఇండస్ట్రియల్ మినిస్టర్ కె టీ ఆర్ చేతుల మీదుగా పనులు ప్రారంభమవుతాయని , సంవత్సరం న్నర లోగా పనులు పూర్తి అవుతాయని, దీని వల్ల గ్రామ ప్రజలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. వంట నూనె కావాలంటే ఎక్కడో దూరంగా వెళ్లి రావడం కన్నా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం అయితే తక్కువ ధర లోనే , ఇక్కడే వంట నూనె లభిస్తుందని అన్నారు.
జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ పాక్ పట్ల గ్రామంలో ని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను పంపిణీ చేయడం వల్ల నిరుపేదలకు లబ్ధి చేకూరిందని వారి సొంతఇంటి కల నెరవేరిందని అన్నారు. అదనంగా డ్రైనేజి, త్రాగునిటీ, మిషిన్ భగీరథ ట్యాంక్ తదితర వివిధ రకాల సదుపాయల కొరకు 30 లక్షలతో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.
ముందుముందు ఈ గ్రామం ప్రసిద్ద గ్రామంగా రూపుదిద్దుకోనుందని మన ఉమ్మడి జిల్లా తో పాటు వివిధ జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుందని, అయిల్ ఫాం ఫ్యాక్రరీ ద్వారా ఎంతో లాభం చేకూరురుందని అన్నారు.