ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 5న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బేస్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి దుర్గం గురువేందర్,జిల్లా కార్యదర్శి మహేష్ తెలిపారు.సీనియర్ విభాగంలో మేల్,ఫిమేల్ సాఫ్ట్ బేస్ బాల్ పోటీలో పాల్గొనేవారు ఉదయం 10గంటలకు హాజరు కావాలని,ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి పాల్గొనాల్సి ఉంటుందని సూచించారు.రిజిస్ట్రేషన్ కోసం, పూర్తి వివరాలకు 9533117323, 9989938936 నంబర్లను సంప్రదించాలన్నారు.