జగిత్యాల, ఏప్రిల్ 22: భారతీయ జనతాపార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయ కార్యదర్శిగా జుంబర్తి దివాకర్ నియమకమయ్యారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల జిల్లాలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న సందర్భంలో జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులను, శ్రేణులను అనుసంధానం చేసేందుకు సమర్ధుడైన కార్యకర్త అవసరం అన్న కోణంలో శోధించడము జరిగిందన్నారు. ఈనేపథ్యంలో జగిత్యాల బీజేపీలో వివాదరహితుడైన దివాకర్ సమర్థుడని భావించి బిజెపి కార్యాలయ కార్యదర్శిగా నియమించడం జరిగిందని జిల్లా అద్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు పేర్కొన్నారు. తనపై అమితమైన విశ్వాసంతో తన నియామకానికి కృషిచేసిన సత్యనారాయణ రావు తోపాటు మిగతా అందరికి దివాకర్ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు.