ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామ కాంగ్రెస్ పార్టీ చెందిన మలవత్ రాజు లక్షెట్టిపేట స్థానిక విశ్రాంతి ఆవరణలోని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి కాషాయ కండువ కప్పి బిజెపి పార్టీ లోకి శనివారం ఆహ్వానించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ…కేంద్రంలో ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి పథకాలతో వాటి అమలు ఎంతగానో ఆకర్షించి బిజెపి పార్టీ రావటం జరిగింది తెలుపారు.అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ…గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి బిజెపి పార్టీ లోకి చేరడం జరిగింది అని తెలిపారు, తానిమడుగు గ్రామంలో నుంచి యువకులు ప్రజలు బిజెపి పార్టీ రావటానికి సిద్దం వున్నారని తెలుపారు.ఈ కార్యక్రమంలో దండేపల్లి,లక్షెట్టిపేట, మండల ఇంచార్జ్ గుండా ప్రభాకర్,బిజెపి మండల అధ్యక్షుడు గొపతి రాజయ్య, ప్రధాన కార్యదర్శి బందెల రవిగౌడ్,రెబ్బనపల్లి ఎంపిటిసి మౌనిక శేఖర్,ముత్యంపేట ఉపసర్పంచ్ ముత్తె వేంకటేష్,లక్షెట్టిపేట బిజెపి పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్,లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు బోప్పు కిషన్,దండేపల్లి బిసి మోర్చ మండల అధ్యక్షుడు ముత్తె అనిల్ కుమార్,దండేపల్లి ఎస్సీ మోర్చ మండల అధ్యక్షుడు బోర్లకుంట వెంకటేష్,బిజెపి సీనియర్ నాయకుడు చంద్రమౌళి,కిషన్,మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.