గోషామహల్ సీపీయం జోన్‌కన్వీనర్ పీ.నాగేశ్వర్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజక వర్గంలోని చాక్నావాడి నాలాకప్పు తరుచు కూలడం సర్వసాధారణమయిపోయినది.ఈ నాలా పై కప్పుపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మకై నాణ్యతా లోపాలను పట్టించుకోక పోవడం ఇన్ని సార్లు కూలిన అధికారులపై చర్యతీసుకోకపోవడం అధికారులకు కాంట్రాక్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ అని ప్రజలు అనుకుంటున్నారు.ఇంకో రకమైన ఆరోపణ చుట్టు పక్కల ఉన్న ట్రాన్స్‌పోర్ట్ ఓనర్లతో అధికారుల సత్ససంబంధాలు మరియు ఆ చుట్టు పక్కల ఉన్న వ్యాపారవేత్తల ఒత్తిడికి లోంగి హేవి వేయికిల్స్ Ê అధిక లోడుగల లారీలను అనుమతించడం దేనికి నిదర్శనమని అడుగుతున్నారు ప్రజలు.స్వయానా సీఎం పరిధిలోఉన్న మంత్రిత్వశాఖ లోని ఈ విధంగా జరుగుతుంటే అధికారులు నిమ్మకు నిరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు.ఈ సమస్యను గోషామహల్ నియోజక వర్గ స్థానిక ప్రజలు సీపీఎం పార్టీ దృష్ఠికి తీసుకెళ్ళాగా సీపీఎం గోషాయహల్ జోన్ కన్వీనర్ పా.నాగేశ్వర్ డిప్యూటీ కమీషనర్‌కు వినతి పత్రం ఇచ్చినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గోషామహల్ నియోజక వర్గంలోని నాలాల పై కప్పు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని నాలాలపై పైకప్పులు ఉన్న దగ్గర హేవీ వెయికల్స్ అధిక లోడు లారీలను అనుమతించవద్దని డియాండ్ చేశారు.లేని పక్షంలో గోషామహల్ సీపీయం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.