కష్ణపడి బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 17:
అనుకున్నవిధంగా, అనుకూలంగా పరిస్థితులు లేకున్నప్పటికి చదువును నిర్లక్ష్యం చేయకుండా, మీరు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్ణపడి బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పదవ తరగతి విద్యార్థినులకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం విద్యార్థులకు హితవు తెలిపారు.
సోమవారం మేడ్చెల్ మండలంలోని కిష్టాపూర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కాలేజీ (బాలికలు)ని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం తనిఖీ చేసారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది మొదటి మెట్టు అని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కష్టపడి చదువుకోవాలని, చదువే మంచి భవిష్యత్తును అందిస్తుందని పదవ తరగతి విద్యార్థినులకు సూచించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో పదవ తరగతిలో విజయం సాధించి భవిష్యత్తులో ఏమి చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆదిశగా ముందుకు వెళ్లాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం విద్యార్థులకు తెలిపారు. పదవ తరగతిలోని ప్రతి విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏగ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు విద్యకై అవసరమైన సలహాలను కలెక్టరు విద్యార్థులకు వివరించారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. సిలబస్ పూరైందా అని, రివిజన్ ఎలా జరుగుతుందని, స్కూల్లో వసతులు ఏలా ఉన్నాయని, భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనశాలలో టేబుల్లు, కుర్చీలు విద్యార్థులకు సరిపడా ఏర్పాటు చేయాలని కలెక్టరు ప్రిన్సిపల్ కు సూచించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకొని, మెను చార్టును పరిశీలించారు. ఈరోజు మెనులో ఏమి వండారని అడిగి, వంటలను పరిశీలించారు. స్కూలు కాలేజీ కలిపి మొత్తం ఎంత మంది విద్యార్థులున్నారని, ఇంటర్ లో ఏఏ గ్రూపులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
స్కూల్ ప్రిన్సిపల్ లలిత, జోనల్ ఆఫిసర్ రజిత స్కూలులో ఉన్న మేజర్, మైనర్ రిపేర్లకు నిధులు కావాలని కలెక్టరు దృష్టికి తీసుకురాగా, కలెక్టరు పరిశీలించి కొత్త డ్రైనేజీ పైప్ లైన్, కూలిపోయిన ప్రహారీ గోడ నిర్మాణం, వసతి గృహాం, స్కూలులోని ఫ్యాన్లు, లైట్లు, వైరింగ్ వంటి ఎలక్ట్రిసిటి మరమ్మత్తులు, టాయిలెట్ల రిపేర్లు, దోమల నివారణకు మెష్, ఫ్లోరింగ్ వంటి పనులకు అయ్యే ఖర్చుల అంచనాల ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలను పెంచాలని కలెక్టరు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ తహాసీల్దార శైలజ, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.