పాల్గొంటున్న గీతం మూడు ప్రాంగణాల అధ్యాపకులు,ఆకట్టుకుంటున్న నిపుణుల ప్రసంగాలు
…. ప్రొఫెసర్ మాయా
పూణే ఫ్లేమ్ విశ్వవిద్యాలయం.
సంగారెడ్డి ఫిబ్రవరి 17 ప్రజ బలం ప్రతినిధి:
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో ‘డిజిటల్ హ్యుమానిటీస్’పై నాలుగు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆంగ్లం, ఇతర భాషల విభాగం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, పాల్గొనేవారిని డిజిటల్ హ్యుమానిటీస్ యొక్క శక్తివంతమైన రంగానికి పరిచయం చేయడం, విద్యావేత్తలు, పరిశోధకుల మధ్య బలమైన బోధనా పద్ధతి, సంభాషణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కీలకమైన డిజిటల్ హ్యుమానిటీస్ లో సమకాలీన ధోరణులను అన్వేషించడానికి, వారి బోధన, పరిశోధన పద్ధతులను మెరుగుపరచడానికి అవసరమైన సాధనాలు, పద్ధతులతో వారిని సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పలు అంతర్దృష్టులు, నైపుణ్యాన్ని పంచుకునేలా విభిన్న వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, గీతం అధ్యాపకులకు మార్గదర్శనం చేస్తున్నారు.
ప్రారంభ కార్యక్రమంలో పూణేలోని ఫ్లేమ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ మాయా కీలక ప్రసంగం చేశారు. ‘భారతదేశంలో కొత్త చరిత్రను గుర్తించడం: డిజిటల్ ఆర్కైవ్స్, పబ్లిక్ హిస్టరీ’పై లోతైన అవగాహనను కల్పించడమే గాక, భారతదేశంలో డిజిటల్ హ్యుమానిటీస్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నిశాంత్ షాను ఉటంకిస్తూ, ‘దేశంలో డిజిటల్ ఆధునికత విస్తృతంగా వైవిధ్య భరితంగా, అసమానంగా వస్తున్న నేపథ్యంలో జీవన పరిస్థితులు, శ్రమ, భాష ఎలా వేగంగా మారుతున్నాయో ప్రశ్నించడానికి, వాటి మ్యాప్ చేయడానికి డిజిటల్ హ్యుమానిటీస్ ను ఒక అవకాశంగా చూడాలి’ అని ఆమె పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను చర్చించడంలో, దాని చుట్టూ ఉన్న చర్చను తిరిగి మానవీకరించడంలో డిజిటల్ హ్యుమానిటీస్ ద్వంద్వ పనితీరును ప్రొఫెసర్ మాయ వివరించారు. మానవీయ శాస్త్రాలు, డిజిటల్, డేటా యొక్క భావనలు, ఈ రంగంలో డిజిటల్ ఆర్కైవ్ ల కీలక పాత్రను చర్చించారు. డిజిటల్ సాధనాల లభ్యతను నొక్కి చెబుతూ, అవి డిజిటల్ ఆర్కైవ్ ల సృష్టిని ఎలా సులభతరం చేస్తాయో, పరిశోధకులు, విద్యావేత్తలను ఎలా శక్తివంతం చేస్తామో డాక్టర్ మాయ వివరించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంగ్ల విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ డాక్టర్ డీ.ఆర్.పీ. చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. సదస్యులను స్వాగతించి, అతిథికి మొక్కను బహుకరించారు. గీతం మూడు ప్రాంగణాల నుంచి వచ్చిన అధ్యాపకులంతా ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రోత్సహించారు. ఆంగ్లం, ఇతర భాషల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ ఈ కార్యక్రమ భావన, లక్ష్యాలను వివరించారు.
మరో మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని ఆసియా ఆర్ట్ ఆర్కైవ్ నుంచి డాక్టర్ నూపూర్ దేశాయ్ ‘డిజిటల్, ఆర్కైవింగ్’పై, గీతం అధ్యాపకులు డాక్టర్ సయంతన్, డాక్టర్ జోంధలే రాహుల్ హిరామాన్ లు ‘క్రిటికల్ డిజిటల్ హ్యుమానిటీస్’పై, ఐఐటీ ఇండోర్ ప్రొఫెసర్ నిర్మలా మీనన్ ‘బోధన, పద్ధతి’ గురించి చర్చించనున్నారు.