ఎస్సీ ,ఎస్టీల గౌరవానికి భంగం కల్గించొద్దు , జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

 

మెదక్ జనవరి 23 ప్రాజబలం న్యూస్:-

ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా SC,ST అట్రాసిటి విజిలెన్స్ ,మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ చట్టం కు సంబంధించిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్ష” సమావేశం లో ఎం ఎల్ సి శేరి సుభాష్ రెడ్డి, ఎం ఎల్ సి యాదవరెడ్డి లతో కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు ప్రవేశ పెట్టిన నివేదికలను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పరిశీలించారు.


మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు అయిన దళితుల పట్ల పొలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని పేర్కొన్నారు.
ప్రతి 3 నెలల కు ఒక సారి ఈ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు.

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కేసులలో బాధితులకు అందవలసిన ఆర్థిక పరిహారం సకాలంలో అందించి వారికి సాంత్వన కలిగించేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్ లకి ఇతర సాధారణ కేసులలో వెళ్తున్న ప్రజల పట్ల సైతం పోలీస్ అధికారులు సున్నితంగా, సామరస్యంగా మెదిలేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో జిల్లా ఎస్పీ ని, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సమాజం లో అందరూ ఒకటే అని ,ఎలాంటి వివక్ష లేకుండా సమాజం లో కలసి మెలసి జివించలన్నరు .
సమావేశం అనంతరం వారి వెంట వచ్చిన పలువురు సర్పంచుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్సీ శేరి కోరారు.


ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ బాల స్వామి, అదనపు కలెక్టర్ లు రమేష్, వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితర అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking