రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం సరికాదు నిర్మల్ లో కాంగ్రెస్ నాయకుల నిరసనలు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..అస్సాంలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ పాదయాత్రను బీజేపీ నాయకులు అడ్డుకోవడంపై నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. స్థానిక గాంధీ పార్క్ లోని బాపూజీ విగ్రహం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ పై జరిగిన దాడిని, ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడిగా భావిస్తున్నట్టు అన్నారు. ఇలాంటి దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి సరికాదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking