పట్టణం లో ట్రాఫిక్ నియత్రణకు ప్రజలు సహకరించండి
ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను, యంత్రాలను,డ్రంక్ అండ్ డ్రైవ్ మెషీన్ లను సరఫరా చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా పొలీస్ ముఖ్య కార్యాలయం లొ జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లకు ట్రాఫిక్ నియత్రణ పరికరాలను సరఫరా చేసిన జిల్లా ఎస్పీ.పట్టణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచటం జరుగుతుంది కనుక ప్రజలు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలనీ మరియు అందరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలియజేసారు. ఈరోజు స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం లొ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా లో ట్రాఫిక్ నియాత్రణ పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు.ముఖ్యంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపరాదని,రాంగ్ రూటు ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్ వంటివి ప్రమాదమని,సెల్ఫోన్ డ్రైవింగ్ మరియు రేష్ డ్రైవింగ్ వల్ల మీకే కాకుండా ఎదుటి వారి ప్రాణానికి కూడా ప్రమాదం అని తెలియజేసారు. పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగవన్నారు.ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా, ప్రమాదాలు గురైనప్పుడు ప్రాణనష్టం తగ్గించడానికి ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమం లొ అవినాష్ కుమార్ ఐపిఎస్,రాజేష్ మీన ఐపిఎస్, ఏ.ఓ యూనస్ అలి, ఇన్స్పెక్టర్ లు అజయ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, నైలు, గోపినాథ్,ప్రవీణ్ కుమార్,కృష్ణ,మల్లేష్, సమ్మయ్య,ఆర్ ఐ లు రాం నిరంజన్,శేఖర్, రామకృష్ణ,రమేష్, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్.ఎచ్.ఓ లు ఆర్.ఎస్ఐ లు తదితర సిబ్బంది పాల్గొన్నారు