తైబజార్ ను దక్కించుకున్న కనుకుంట్ల సుదర్శన్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 25:

మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం
2025 -26 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి తై బజార్ బహిరంగ వేలమును నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు తెలిపారు. ఈ వేలం పాటలో కనుకుంట్ల సుదర్శన్, ఆడెపు వేణు, మద్దెల సంజీవ్, మద్ది వేణుగోపాల్, మహమ్మద్ ముస్తఫా, రాకం సంతోష్, దుద్దెల తిరుపతి లు పాల్గొనగా పై వారిలో అందరికన్నా అధికంగా వేలం పాట పాడి రూ.4,73,200.00 లకు కనుకుంట్ల సుదర్శన్ తై బజార్ హక్కులు సొంతం చేసుకున్నాడని కమీషనర్ రాజలింగు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking