మర్పల్లి లోప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలి

 

– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడెం రాములు యాదవ్ కు వినతిపత్రంఅంద చేసిన విద్యార్థులు

వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి(మార్చి 25) వికారాబాద్ జిల్లామర్పల్లి: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ చదవాలని ఆసక్తి ఉన్నప్పటికీ మర్పల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో కొంతమంది పేద విద్యార్థులు, యువతులు డిగ్రీ వరకు చదువు కొనసాగించలేక పోతున్నారు, మర్పల్లి మండల కేంద్రము లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులు కు కొండంత అండగా ఉంటుదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడెం రాములు యాదవ్ కు వినతి పత్రాన్ని స్థానిక యువకులు, నాయకులు కలసి అందచేశారు,దూర ప్రాంతాలకు వెళ్లి చదివే స్తోమత లేక కొంతమంది మహిళలు ఇంటర్ వరకే చదివి దూరంగా ఉంటున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడెం రాములు యాదవ్ మాట్లాడుతూ మర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కొరకు రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ది కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలాంటి అభివృద్ధి పనులు అవసరం ఉన్న తమ దృష్టికి తీసుకు వస్తే వాటిని ఉన్నత అధికారులు లేదా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు వీరేశం, రజినీకాంత్, నగేష్, సాయీ, పులుమద్ది శ్రీకాంత్, యాదయ్య, భంతి, ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపధ్యక్షుడు గణేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోటిగరి జగదీశ్వర్ (లడ్డు)కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాచాన్న, శేఖర్ యాదవ్, శివ, నర్సింహులు యాదవ్, వినోద్ స్వామి, రంగారెడ్డి, మారుతి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking