బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు

 

చందుర్తి – మార్చి 26 (ప్రజాబలం దినపత్రిక)

ఆన్లైన్ బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని అప్పుల పాలుఐ ప్రాణాలు కోల్పోవద్దని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యువత ఆన్లైన్ బెట్టింగుల ద్వారా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ అప్పుల పాలు అవుతున్నారని ప్రస్తుతం దేశంలో ధనాధన్ ఆటగా పేరోందిన ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత గెలుపోటములపై పందాలు కాయవద్దని మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఓమ్ము చేయవద్దని చెడు మార్గాల్లో వెళ్ళవద్దని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలను పర్యవేక్షించాలని ఉన్నత చదువులు చదివి భావి తరాలకు ఆదర్శం కావాలని ఐసిసి నిర్వహించేది క్రికెట్ అనే బెట్టింగ్ తిమింగలాలకు అది పెద్ద వ్యాపారం అని క్రికెట్ బెట్టింగులు చేస్తూ నష్టపోయి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ జీవితాలను అర్థాంతరంగా ముగిసేలా కాకుండా తల్లిదండ్రులకు కడుపుకోత మిగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలని వారి ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే తక్షణమే స్పందించి తగు సూచనలు చేయాలని లేదంటే డబ్బుతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఇలాంటి ఆన్లైన్ బెట్టింగులు ఎవరైనా ఆడిన ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking