ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా గ్యారెంటీ పథకాల డాక్యుమెంట్ సేకరణ::విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 5:
ప్రతి ఎంపిడిఓ, మున్సిపల్ వార్డు కార్యాలయలలో ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు, ప్రజాపాలన సాఫ్ట్ వేర్ పని తీరు పై క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు. అర్హులైన లబ్దిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రజా పాలన సేవా కేంద్రాల సాఫ్ట్ వేర్ పై జిల్లా కలెక్టర్ లతో రివ్యూ నిర్వహించిన విద్యుత్ శాఖ కార్యదర్శి.ప్రజా పాలన సేవ కేంద్రాల ద్వారా గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్ వేర్ లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు,సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన లో భాగంగా గృహాజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఆన్లైన్ ప్రక్రియలో ఏవైనా లోపాలు ఉంటె వాటిని సవరించి అర్హులకు లబ్ది చేకూర్చాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేటులోని వి సి హాల్ లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య తో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ గృహలక్ష్మి, మహాలక్ష్మి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో తప్పులు లేకుండా సరి చేసి అర్హులకు లబ్ది చేకూర్చాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓల ను ఆదేశించారు. ఇదివరకే ఏర్పాటు చేసిన ప్రజా పాలనా సేవ కేంద్రాల వద్దనే ఈ ప్రక్రియను కొనసాగించాలన్నారు. ఆన్లైన్ లో అభ్యర్థి ఆధార్ నంబర్, కరెంట్ బిల్ యు ఎస్ సి నెంబర్, గ్యాస్ కనెక్షన్ కస్టమర్ ఐ డి, కన్స్యూమర్ ఐ డి లను క్రాస్ చెక్ చేసి సవరించిన కరెక్షన్ లను రిజిస్టర్ నందు తప్పని సరిగా నమోదు చేయాలన్నారు. దరఖాస్తు దారులు అధిక సంఖ్యలో ఉన్న చోట ఎండ తీవ్రంగా ఉన్నందున త్రాగునీరు, షామియానాలు వేసి నీడ ఉండేలా చూడాలన్నారు. బోడుప్పల్, నిజాంపెట్, జవహర్ నగర్ లలో అధిక సంఖ్యలో దరఖాస్తు దారులు ఉంటారని అవసరమైతే 2 లేదా 3కంప్యూటర్లను, ఆపరేటర్లను అందుబాటులో ఉంచాలని, రద్దీగా ఉన్న చోట ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు దగ్గరుండి పరిశీలించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking