తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని కొనసాగించాలి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,

 

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 3: సోమవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 96వ జయంతి ఉత్సవంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జాన్సీ రాణి, తో కలిసి పాల్గొనీ జ్యోతి ప్రజ్వలన గావించి దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని, దొడ్డి కొమరయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటములో అమరుడైన దొడ్డి కొమరయ్య జయంతి ఏప్రిల్ 3, వర్ధంతి జులై 4 లను అధికారికంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో దైర్యంగా ఎదుర్కొని పోరాటం చేసి తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య దైర్యాన్ని, సేవలను స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసీఓ శ్రీనివాస్, పశుసంవర్ధక అధికారి, శేఖర్,గొల్ల, కురుమ కుల సంఘాల నాయకులు, కల్లెక్టరేట్ సిబంది , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking