న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 03 : డిల్లీలో గుర్తు తెలియని దుండగులు న్యాయవాదిని హత్య చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు సోమవారం లక్షెటిపేట కోర్టులో విధులు బహిష్కరించారు.ఈ సందర్భంగా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల బ్యాడ్జీ లు దరించి నిరసన తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ మాట్లాడుతూ….న్యాయస్థానంలో కేసులు పరిష్కరించబడంరో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులపై భౌతిక దాడులు చేయడం,హత్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజేశ్వర్, న్యాయవాదులు కేతిరెడ్డి భూమరెడ్డి,కొమ్మిరెడ్డి,సత్తన్న,ప్రదీప్ కుమార్,రెడ్డిమల్ల ప్రకాశం, చాతరాజు మల్లికార్జున్,చాతరాజు శివశంకర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking